నవతెలంగాణ- రాయపోల్ : వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని బుధవారం రాయపోల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వాడ వాడలో విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ప్రజలు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మండపాలలో ప్రతిష్టించారు. వినాయకుని కోసం ఏర్పాటు చేసిన మండపాలను విద్యుత్ కాంతుల దీపాలతోటి మామిడి తోరణాలు అరటి ఆకులు పూలమాలతో అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం, సాయంత్రం ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో భజనలు, భక్తి పాటల తోటి ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాయపోలు మండల కేంద్రంలో అతి పురాతన గణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద ఎస్సై కుంచెం మానస ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ శాఖ వారు శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా జాగ్రత్త నిబంధనలు పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని వినాయక విగ్రహ ఉత్సవ కమిటీలకు సూచించడం జరిగింది. అలాగే మండపాల వద్ద ఎలాంటి అసాంఘిక,భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలని ముందే సూచించడం జరిగింది. కావున భక్తులు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.
వాడవాడల వెలిసిన గణనాథులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES