- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దుర్గామాత మండపం ముందు వేద పండితులతో మహా యజ్ఞాన్ని నిర్వహించారు. 50 మంది దుర్గ మాత మాల ధారణ భక్తులతో యజ్ఞ కార్యక్రమాన్ని పండితులు విట్టల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, నారాయణరెడ్డి, జీవన్ రెడ్డి, శివరాత్రి రామచంద్రం, శివరాత్రి లక్ష్మీనారాయణ, శ్రీనాథ్ గౌడ్, మోకాళ్ల హన్మంత్ రెడ్డి, జైపాల్, డాకూరి రవి, కుమ్మరి ప్రవీణ్, మద్దూరి బాపురెడ్డి, నిఖిల్ గౌడ్, శివరాత్రి శేఖర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -