Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మహాసభలను జయప్రదం చేయాలి 

మహాసభలను జయప్రదం చేయాలి 

- Advertisement -
  • – సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్ 
  • నవతెలంగాణ-భూపాలపల్లి
  • ఈనెల 15వ తేదీ నుండి జరిగే సిపిఐ పట్టణ 18వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ కుమార్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవనంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, సిపిఐ నాయకులు గురుజపెల్లి.సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ. ఈనెల 15 న సింగరేణి కమ్యూనిటీ హాల్ సుభాష్ కాలనీలో పట్టణ 18వ మహాసభను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. మహాసభకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. కావున భూపాలపల్లి పట్టణంలోని 30 వార్డులలో సుమారు 250 మంది డెలిగేట్స్ తో ఈ మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభలో పట్టణ అభివృద్ధి కోసం, అర్హులైన వాళ్లందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్, వృద్ధాప్య, వితంతు ఒంటరి మహిళ పింఛన్ల కోసం ఈ మహాసభలో పోరాట కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. భూపాలపల్లి  పట్టణం మీదగా నడుస్తున్న లారీలను అదుపు చేసి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలను మేధావులు,కార్మికులు,  మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాతంగి రాంచంధర్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, అస్లాం, రవీందర్, శాంతి, శేఖర్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad