Saturday, February 28, 2026
E-PAPER
Homeజిల్లాలు12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ కోరారు. శుక్రవారం మండలంలోని ఉప్లూర్, కమ్మర్ పల్లి, హాస కొత్తూర్ గ్రామాల్లో ఉన్న బీడీ సెంటర్లను సందర్శించి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కరపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, విబిజి రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసి లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకునేలా కార్మిక వర్గం ప్రతిఘటనకు పూనుకోవాలన్నారు.

ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా మాస్ లైన్ జిల్లా నాయకులు సారా సురేష్, మండల కార్యదర్శి బషీరి అశోక్, మోర్తాడ్ మండల కార్యదర్శి జి. కిషన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -