ప్రజా సంఘాల నాయకులు డిమాండ్
నవతెలంగాణ – మల్హర్ రావు
మధ్యభారతంలో ఆదివాసులపై పాలకులు కొనసాగిస్తున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కోకన్వీనర్ ఐతు బాపు,ప్రజాప్రంట్ జిల్లా కార్యదర్శి పార్వతి, యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని కొయ్యుర్ సెంటర్ లో ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ లో జరువుతున్న సమావేశం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును కాలరాయలనడం అత్యంత అమానియమన్నారు.
దీనికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యమేన్నారు. మధ్య భారతంలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి పాలకులు చేస్తున్న కుట్రలో భాగంగానే ఆపరేషన్ కగార్ ని విమర్శించారు. పేద ప్రజల సంక్షేమాన్నీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం కేవలం బడా పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తూ వారి అడుగులకు మడుగులు ఒత్తుతొండని దుయ్యబట్టారు. ఈ విధానాన్ని విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, యువకుకు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు అంతా తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. అలాగే 24న కరీంనగర్ లో జరుగుతున్నటువంటి బహిరంగా సభకు వేలాది సంఖ్యలో కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటి బాపు, గడ్డం లక్ష్మయ్య, అక్కినేని సమ్మయ్య, గొట్టం ఎల్లయ్య, సుంక వెంకటి, బీస్కుల లచ్చన్న, సేద మల్లేష్, అరవిందు లక్ష్మి, చెలియా, అరవండి మల్లక్క, కోట సమ్మయ్య, అరవండి విమల పాల్గొన్నారు.
ఆదివాసులపై మారణకాండను ఆపివేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES