Monday, September 15, 2025
E-PAPER
Homeఆటలుఅమ్మాయిలకు నిరాశే

అమ్మాయిలకు నిరాశే

- Advertisement -

ఫైనల్లో 1-4తో భారత్‌ ఓటమి
మహిళల హాకీ ఆసియా కప్‌

గాంగ్షు (చైనా) : 2025 మహిళల హాకీ ఆసియా కప్‌ విజేతగా చైనా నిలిచింది. ఆదివారం చైనాలోని గాంగ్షులో జరిగిన ఫైనల్లో భారత్‌పై 4-1తో ఆతిథ్య చైనా సాధికారిక విజయం సాధించింది. టైటల్‌ పోరులో తొలి నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌లు సాధించిన భారత్‌.. 1వ నిమిషంలోనే 1-0 ఆధిక్యం సాధించింది. ఫార్వర్డ్‌ నవనీత్‌ కౌర్‌ మ్యాచ్‌ మొదలైన 59వ క్షణంలోనే పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. భారత్‌కు 1-0తో ఆధిక్యంతో పాటు మానసికంగా పైచేయి సాధించేలా చేసింది. తొలి క్వార్టర్‌లో చైనాను నిలువరించిన భారత్‌ డిఫెన్స్‌.. రెండు, మూడో క్వార్టర్స్‌లో గోల్‌ కోల్పోయింది. 21వ నిమిషంలో జిక్సియా, 41వ నిమిషంలో లీ హాంగ్‌లు గోల్స్‌ కొట్టారు. దీంతో రెండో క్వార్టర్‌లో స్కోరు సమం చేసిన చైనా.. మూడో క్వార్టర్‌లో 2-1తో ముందంజ వేసింది. నాల్గో క్వార్టర్‌లో రెండు గోల్స్‌ కొట్టిన చైనా.. 4-1తో తిరుగులేని ఆధిపత్యం చూపించింది. 52వ నిమిషంలో జాంగ్‌, 54వ నిమిషంలో చెన్‌ చైనాకు గోల్స్‌ కొట్టారు. చైనాకు ఏడు పెనాల్టీ కార్నర్‌లు లభించిగా ఓ సారి మాత్రమే గోల్‌గా మలిచింది. భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు దక్కగా.. ఒక్క గోల్‌ సాధించింది. తొలి నిమిషంలోనే మూడు పెనాల్టీ కార్నర్‌లు సాధించిన భారత్‌.. నాల్గో పెనాల్టీని 40వ నిమిషంలో గెల్చుకుంది. కానీ గోల్‌గా మలచటంలో విఫలమైంది. ఆసియా కప్‌ విజేతగా నిలిచిన చైనా 2026 హాకీ వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. భారత్‌ ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -