న్యూఢిల్లీ: కొత్త ఏడాది 2026లోనూ బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 సంవత్సరం ముగిసే సమయానికి బంగారం, వెండి ధరలు చారిత్రక స్థాయిలకు చేరుకున్నాయి. బంగారం ధరలు 66 శాతం ఎగిసి.. గడిచిన 50 ఏండ్లలో గరిష్ట పెరుగుదలను నమోదు చేసింది. వెండి 157 శాతం పైగా పెరిగి రికార్డు సృష్టించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా 2026లో కూడా బంగారం సురక్షితమైన పెట్టుబడిగా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇది ఔన్సు ధర 5,000 డాలర్ల వరకు, భారతీయ మార్కెట్‌లో తులం బంగారం రూ.1.50 లక్షల నుంచి రూ. 1.65 లక్షల వరకు చేరవచ్చని అంచనా. సోలార్ ప్యానెల్స్, విద్యుత్ వాహనాల్లో వెండి వినియోగం పెరగడం వల్ల ఈ లోహం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. కిలో వెండి ధర రూ.2.40 లక్షల నుంచి రూ.2.75 లక్షల వరకు చేరవచ్చని.. కొందరు నిపుణులు రూ. 4 లక్షల మార్కును కూడా అంచనా వేస్తున్నారు. 2026లో బంగారం, వెండిలో 50:50 నిష్పత్తి ప్రకారం పెట్టుబడులు ఉత్తమమని సూచిస్తున్నారు.
2026లోనూ బంగారం మెరుపులే…!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



