– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ అన్ ఇన్ సొసైటీ) పథకాన్ని చేపట్టిందని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉల్లాస్ పథకంలో భాగంగా ఐకేపీ మహిళలకు పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాలను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సందర్శించారు. హాయ్ కేంద్రాల్లో ఉల్లాస పరీక్ష జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రతీ మహిళా అక్షర జ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కొత్తపల్లి హారిక అశోక్, నలిమేల రేవతి గంగారెడ్డి, బెజ్జారపు రాజేష్, ఐకేపి ఏపిఎం రవి కిరణ్, ఐకేపి సీసీలు, గ్రామ సంఘం మహిళలు, వివోలు తదితరులు పాల్గొన్నారు.



