గ్లోబల్ సమ్మిట్‌లో క్రీడామంత్రి శ్రీహరి
నవతెలంగాణ-హైదరాబాద్
2036 ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా తెలంగాణ క్రీడా పాలసీని రూపొందించినట్టు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో మంగళవారం జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా జరిగిన ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సులో తెలంగాణ క్రీడా విజన్‌ను మంత్రి ఆవిష్కరించారు. ‘క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేశాము. క్రీడా వ్యవస్థను బలోపేతం చేసేందుకు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశాము. ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేశాము. పాఠశాల స్థాయి నుంచి క్రీడల బలోపేతానికి కృషి చేస్తున్నాము. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు, ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేశామని’ వాకిటి శ్రీహరి తెలిపారు. మైనారిటీ శాఖ మంత్రి, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి సహా అనిల్ కుంబ్లే, అంబటి రాయుడు, పుల్లెల గోపీచంద్, పివి సింధు, గుత్తా జ్వాల తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
మూడు సంస్థలతో ఒప్పందాలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా మూడు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1000 కోట్లతో శాటీలైట్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం జిఎంఆర్ స్పోర్ట్స్-దుబారు స్పోర్ట్స్ సిటీతో, రూ.500 కోట్లతో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు కోసం ఇండియా ఎక్స్‌ట్రీమ్ అడ్వెంచర్ ప్రయివేట్ లిమిటెడ్‌తో, రూ. 75 కోట్లతో మోటార్ రేసింగ్ గేమ్స్ ఏర్పాటుకు సూపర్‌క్రాస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందాలు కుదిరాయి.
ఒలింపిక్ పతకాలే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



