Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పేదల అభ్యున్నతే ద్యేయం..

పేదల అభ్యున్నతే ద్యేయం..

- Advertisement -

-సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కవ్వంపల్లి
నవతెలంగాణ – బెజ్జంకి

పేదల అభ్యున్నతే..కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని..పేదలకు సహయమందజేయడానికి సీఎంఆర్ఎఫ్ ఆర్థికంగా తొడ్పాటును అందిస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండలంలోని అయా గ్రామాల బాధితులకు రూ.13.52 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులందజేశారు. మండలంలోని పలువురు మహిళలు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ముత్తన్నపేట గ్రామంలో నిర్మించిన నూతన నీటీ సరఫరా ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు.ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,మండల కార్యనిర్వాహణ అధ్యక్షుడు పోచయ్య,మండల ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్, ఆలయ చైర్మన్ ప్రభాకర్,నాయకులు గూడెల్లి శ్రీకాంత్,బైర సంతోష్,అయా శాఖల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img