Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్2028లో బీసీ ప్రభుత్వమే లక్ష్యం 

2028లో బీసీ ప్రభుత్వమే లక్ష్యం 

- Advertisement -

బీసీలకు న్యాయం జరగాల్సిందే: వరిపల్లి అనిల్ కుమార్
నవతెలంగాణ – నెల్లికుదురు

తెలంగాణలో బీసీలకు రాజకీయంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర బీసీ జేఏసీ యూత్ ఫోర్స్ నాయకుడు వరిపల్లి అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో త్వరలో బీసీల కోసం ఒక కొత్త రాజకీయ వేదిక ఏర్పాటవుతుందని తెలిపారు. 2028 లో బీసీ ప్రభుత్వ ఏర్పాటే మా ముఖ్య లక్ష్యం అని అన్నాడు.ప్రస్తుతం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  నాయకత్వంలో బీసీ ప్రజల్లో విశ్వాసాన్ని రేకెత్తిస్తోంది అని బీసీలకు స్వరాజ్యం కావాలంటే రాజకీయ అధికారమే మార్గం ఒకటే అని తెలిపారు. బీసీల జనాభా అధికమైనప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నదని, ఇకపై ఆ పరిస్థితిని మార్చేందుకు బీసీ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీలు అంత ఐక్యమత్యం ఉండి మన అభివృద్ధికి ముందుకు సాగాలని కోరినట్ల తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -