Wednesday, September 24, 2025
E-PAPER
Homeజిల్లాలుఆలేరు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యం.. 

ఆలేరు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యం.. 

- Advertisement -

గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 

ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం కాచారం, బుధవారం గ్రామ చెరువు నిండి అలుగు పారుతుండడం తో బీర్ల అయిలయ్య గ్రామస్తులు రైతులతో కలిసి పసుపు కుంకుమ వేసి, హారతి ఇచ్చి, పువ్వులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్యకు మాజీ ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎడ్ల రామ్ రెడ్డి గ్రామస్తులతో కలిసి ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి గొలుసుకట్టు చెరువులు నిండుతూ ఉండడంతో సంతోషం వ్యక్తం చేశారు.  గత 10 సంవత్సరాలు పరిపాలించిన బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఓటీలు కట్టడకపోవడంతో నీరు వృధాగా పోయిందని అన్నారు.

ఇప్పుడు ఓటీలు కట్టడంతో వర్షపు నీరు సమృద్ధిగా గొలుసు కట్టు చెరువులు నిండుతూ ఉన్నాయని అన్నారు. కాలువల నిర్మాణానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ ఒక్క చుక్క కూడా వృధాగా పోకుండా దేవాదుల నుంచి, అశ్వరావు పల్లి నుంచి సుమారు 20 చెరువులను నింపుకున్నామని అన్నారు. ఆలేరు నియోజకవర్గం లో ఉన్న ప్రతి చెరువును నింపాలని ఉద్దేశంతో ముందుకు పోతున్నామని అన్నారు. నవాబుపేట గుండాల మండలం సస్యశ్యామలం అయింది  అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మండల నాయకులు దుంబాల వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ కాల్నే భాస్కర్, వాకిటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -