నవతెలంగాణ – మిడ్జిల్
తండాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించే విధంగా కృషి చేస్తానని సర్పంచ్ ధర్మానాయక్ అన్నారు. సోమవారం మండలంలోని ఈదులబ్బాయి తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కాటోనిగడ్డ తండాలో రూ.6 లక్షల రూపాయల సిసి రోడ్డు పనులను మాజీ సర్పంచ్ భాస్కర్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మనాయక్ మాట్లాడుతూ.. తండాలలో ఉన్న సమస్యలను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు.
గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, రాజకీయాలకతీతగా తాండాలలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తానని చెప్పారు. గిరిజనులందరూ కూడా పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. తండాలలో రాజకీయాలప్పుడే రాజకీయాలు చేయాలని అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవద్దని కోరారు. ఈదుల అబ్బాయి తండా పరిధిలోని అన్ని తండాలకు బిటి రోడ్డు ఏర్పాటు పనులను త్వరగా పూర్తిచేసేందుకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎం రవి , వార్డ్ వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



