ప్రతి మహిళను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
పనుల జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికను సిద్ధం చేసి ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. పనులు జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాలకుర్తి మండలంలో మైలారం స్మశాన వాటిక నుండి చెన్నూరు గ్రామ శివారు లావిడ తండా వరకు కోటి రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును, పాలకుర్తిలో 30 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని, విసునూరులో 20 లక్షలతో నిర్మించిన పల్లె దావకాను, ముత్తారంలో 20 లక్షలతో నిర్మించిన పల్లెదావకానను ముత్తారం నుండి పార్టీ మీద తండాకు వెళ్లే రోడ్డు మార్గంలో రెండు కోట్ల 80 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి పనులను ప్రారంభించారు. వల్మిడి నుండి తీగారం కు రెండు కోట్ 80 లక్షలతో నిర్మించే రోడ్డు పనులకు
శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు ప్రత్యేక దృష్టిని పెట్టారని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం లో పెండింగ్లో ఉన్న పనులను తరితగ్గత్తిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడతానని తెలిపారు. ప్రతి మహిళను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్నది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని తెలిపారు. మహిళలు ఆదాయ వనరులను సమకూర్చుకొని అభివృద్ధి చెందేందుకు వ్యాపారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు ఆర్థిక ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ముందుకు సాగాలన్నారు. పాలకుర్తిలో శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మండపాన్ని మండల సమైక్యకు కేటాయించామని తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.
సోలార్ ప్లాంట్ల నిర్వహణతో పాటు ఆర్టీసీ బస్సును కొనుగోలు చేసి మండల సమైక్యకు అప్పగిస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పల్లె ధావకానులను ఏర్పాటు చేశామని అన్నారు. నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యాధికారులను ఆదేశించారు. పాలకుర్తి, కొడకండ్ల దేవరుప్పుల మండలాల అభివృద్ధికి 17 కోట్ల 70 లక్షలను మంజూరు చేశామని అన్నారు. మహిళలను పదేళ్లుగా గత ప్రభుత్వం మోసం చేసిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడడంతో మహిళలకు అండగా నిలిచామని అన్నారు. వడ్డీ లేని రుణాలను అందించి మహిళలకు అండగా నిలిచామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టామని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎంతవరకు ఆదా అవుతుందో ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లను సైతం మహిళలకే కేటాయిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులను అందించి అండగా నిలిచామని తెలిపారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ ల వరకు అభివృద్ధి చేస్తున్న పార్టీల అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి వసంత, ఏపీడి నూరొద్దీన్, పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్లు వీరమనేని యాకాంతరావు, అడ్డూరి రవీందర్రావు, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.