ఆర్మూర్ చిన్న బాలరాజ్
నవతెలంగాణ – దర్పల్లి
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరడమే తమ పార్టీ సిద్ధాంతమణి మండల కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, ఈ సందర్బంగా అయన నిన్న రాత్రి మండల కేంద్రములోని మైనారిటీ సోదరుల సౌకర్యార్థం వారి అభ్యర్తన విని ఖాబ్రస్థాన్ లో ఒక ఈ మాక్స్ లైట్ ఏర్పాటుకు, రూరల్ ఎమ్మెల్యే డా, భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే అడిగిన వెంటనే లైటు ఏర్పాటుకు కృషిచేసి లైటును అందించడం జరిగిందని అన్నారు.
దింతో శనివారం రాత్రి ఖాబ్రస్థాన్ లో ఐమాక్స్ లైటు ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు అభివృద్ధి పరిచడమే తమ పార్టీ ధ్యేయమని అన్నారు. అలాగే తమ అభ్యర్థన కు స్పందించి లైట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి స్థానిక కాంగ్రేస్ నాయకులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ గారికి, సర్పంచ్ శ్రీనివాస్ లకు మండల మైనారిటీ సోదరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమములో మాజీ సొసైటీ చేర్మెన్ చెలిమేల మల్లికార్జున్, ఊప సర్పంచ్ ఎజ్జా శ్రీకాంత్, కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, వార్డు మెంబర్ అబ్దుల్ మజీద్, నజీర్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.



