- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనిధి గ్రూప్ 1లో ఎంపీడీఓగా ఎన్నికైయ్యారు. ఆమె లక్ష్యం సివిల్స్ సాధించడం. ఆమె తల్లి కృష్ణ వేణి గృహిణి, తండ్రి నరేందర్ కిరణ షాప్ నడుపుతున్నారు. నవతెలంగాణతో శ్రీనిధి మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షను మూడు సార్లు రాశానని తెలిపారు.
పేపర్ లిక్ కావడంతో పరీక్షలను రద్దు చేశారు. మళ్ళీ మళ్ళీ వ్రసన్నాన్నారు. సివిల్స్ మూడు సార్లు వ్రాసి ఇంటర్వూ వరకు వెళ్లి వచ్చానని తెలిపారు. సివిల్స్ సాధించడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. 10వ తరగతి వరకు నవ్య భారతి స్కూల్ లో, ఇంటర్, డిగ్రీ శ్రీచైతన్య ఐఎఎస్ అకాడమి హైదారాబాద్ లో చదివాన్నారు.
- Advertisement -