ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సహకారంతో మునిగలవీడు గ్రామంలో యూరియా సరఫరా
మునిగిలవీడు గ్రామ సర్పంచ్ చైతన్య నాగరాజు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మునిగల వీడు గ్రామంలో రైతుల కష్టాలను తొలగించడమే లక్ష్యంగా త్వరలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి సహకారంతో యూరియా బస్తాల సరఫరా చేయబోతున్నామని ఆ గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు తల్లి పారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ గ్రామంలోని రైతులు యూరియా బస్తాల కోసం వేరే గ్రామానికి ఆటో కిరాయిలు హెచ్చించి వెళ్లి మళ్లీ రావడంతో ఎంతో కష్టంతో కూడుకున్న శ్రమని అన్నారు రైతులు అలాంటి కష్టానికి గురికాకు ఉండడం కోసం శ్రీ రామగిరి పిఎసిఎస్ ఆధ్వర్యంలో మునిగిలవీడు గ్రామంలో ఒక సేల్ పాయింట్ ను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.
అందులో రైతులకు కావాల్సిన మందు బస్తాలు లభ్యమవుతాయని అన్నారు. దీంతో రైతుల కష్టాలు తొలగి మరియు వారి ఖర్చు కూడా లేకుండా ఉండాలని ఉద్దేశంతో ఈ గ్రామంలోని ఒక సేల్ పాయింట్ కావాలని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ను కోరగా వెంటనే గ్రామానికి ఒక సేల్ పాయింట్ ఇప్పించి రైతులను ఆదుకుంటామని చెప్పారని అన్నారు. దానికి వెంటనే ఇక్కడ ఒక సెల్ పాయింట్ ఇప్పించి రైతులను ఆదుకుంటున్నాందుకు గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కి కృతజ్ఞతలు అని దీనిపట్ల హర్ష వ్యక్తం ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు ఉన్నారు.



