బొబ్బ విజయ్ రెడ్డి బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
విద్యారంగంలో అద్భుతంగా రాణించాలని విద్యార్థులను ప్రోత్సహించాలన్నదే తన లక్ష్యమని బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లక్నవరం గ్రామపంచాయతీ దుంపలగూడెం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ మరియు ఎంపిఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన రాత పుస్తకాలు ఇతర సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా విజయ్ రెడ్డి మాట్లాడుతూ బాల్యంలో ఈ గ్రామంలో ఈ పాఠశాలలో చదువుతూ చదువు కొరకు ఎన్నో వ్యయ ప్రయాసలకు గురికావడం జరిగిందని అన్నారు. అలాంటి ఇబ్బందికర పరిస్థితి నేటి విద్యార్థులకు ఏర్పడకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం విద్యార్థులకు అవసరమైన విద్యాసామాగ్రిని గత 20 సంవత్సరాలుగా అందిస్తున్నామని అన్నారు.
ఈ పాఠశాలకే కాకుండా అడిగిన ఇతర పాఠశాలలకు కూడా విద్యా పరంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేస్తున్నామని అవసరమైన సామాగ్రిని అందిస్తున్నామని అన్నారు. గతంలో కూడా పాఠశాలకు అవసరమైన క్రీడా సామాగ్రిని అందించడంతోపాటు గ్రామంలో ప్రజల ఆరోగ్యం కోసం ఫిల్టర్ వాటర్ ను కూడా అందిస్తున్నామని నాటి నుండి నేటి వరకు దాని మరమ్మత్తులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. రామాలయం నిర్మాణం లో కూడా ఆర్థికంగా కృషి చేయడం జరిగిందన్నారు పక్క గ్రామాలకు కూడా ఆలయాల నిర్మాణం కోసం ఆర్థికంగా విరాళాలు అందించామని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని బాగా చదివి మంచి మార్కులతో మంచి ఫలితాలు సాధించాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం రవీందర్ జితేందర్ గణేష్ లక్ష్మీనారాయణ హసీనా మేడం పాల్గొన్నారు.



