Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యం 

పేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యం 

- Advertisement -

మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత
సేవ చేయడం అదృష్టంగా భావించాలి
ఎన్ జి ఎఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడం లక్ష్యంగా ఎన్ జి ఎఫ్ ముందుకు సాగుతుందని ఎన్ జి ఎఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్ ప్రధాన కార్యదర్శి తాళ్ళ మహిపాల్ రెడ్డి అన్నారు. మృతి చెందిన ఏర్పుల వెంకటమ్మ కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని అందించి ఓదార్చి మనోధైర్యం నింపే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఏర్పుల వెంకటమ్మ మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆమె అందరితో అందరూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామ అభివృద్ధిలో తమ వంతు ముందుకు సాగడం జరిగిందని అన్నారు.

అలాంటి వ్యక్తి ఈరోజు మరణించడం ఎంతో విచారకరమని అన్నారు మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సింగారపు యాకేష్ సంస్థ సభ్యులు తాళ్ల ప్రభాకర్ రెడ్డి, షేక్ అజీమ్, రాపాక నవీన్, వేములకొండ ఉమేష్, బొల్లు అశోక్ నాయకులు  బొల్లు మురళి, జెల్ల సోమయ్య, నోముల వెంకన్న, కారం ప్రశాంత్, పిడుగు యాకయ్య, జెల్ల పరుషరాములు, జెల్ల రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad