Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నూలి పురుగుల నివారణే లక్ష్యం

నూలి పురుగుల నివారణే లక్ష్యం

- Advertisement -

థానిక వైద్య అధికారిణి డాక్టర్ ఎం. మౌనిక 
నవతెలంగాణ – కాటారం

బాల బాలికల్లో నులి పురుగుల సమస్య నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి ఏటా అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేస్తుందని స్థానిక వైద్యాధికారిణి యం. మౌనిక అన్నారు. సోమవారం కాటారం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్, బాలుర, బాలికల, కస్తూర్బా హాస్టల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ప్రభుత్వ వైద్య అధికారిని మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఇరు పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు నులిపురుగుల నివారణకు అల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు . విద్యార్థులకు అల్బెండజోల్‌ మాత్రలను ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు విడతల్లో నులి పురుగు నివారణ మాత్రలు పంపిణీ చేస్తుందని, చిన్న వయస్సులోనే కొందరు పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే ఇంకొందరు నులి పురుగుల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నరన్నారు. పిల్లల్లో నులి పురుగులను నివారిస్తే వ్యాధి నిరోధకత పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సరళ,హెల్త్ అసిస్టెంట్ సమ్మయ్య,మహిళా హెల్త్ అసిస్టెంట్ సిహెచ్ సరోజన, మనోరమా, కుమ్మరి రజిత, నాగరాణి, రజిని,శ్యామల విజయలక్ష్మి,ఆశ కార్యకర్తలు పద్మ,రమ,లత , ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img