- Advertisement -
నవతెలంగాణ-ఆమనగల్ : నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఐక్యత ఫౌండేషన్ కృషి చేస్తుందని టాస్క్ సీఓఓ ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి అన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎలికట్ట గ్రామంలో వన్ మెడి సంస్థ సహకారంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
- Advertisement -



