నవతెలంగాణ – పెద్దవూర
గిరిజన తండాలలో మౌలిక సదుపాయాలే లక్ష్యంగా జీవన నైపుణ్యాల పెంపుదల ధ్యేయంగాపీఎం ధర్తీ అభ.. ఆది కర్మయోగి అభియాన్సహకరిస్తుందని జిల్లా మాస్టర్ ట్రైనర్ నగేష్,మండల బ్లాక్ మాస్టార్ ట్రైనర్ కొల్లు బాలకృష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోజరిగిన సమావేశం లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పీఎం జన్ జాతీయ గౌరవ్ వర్ష ” దివస్ ను గిరిజన స్వతంత్ర సమరయోధులు,ఆదివాసి అస్తిత్వ ఉద్యమానికి వేగుచుక్క, అని అన్నారు. బ్రిటిష్ పాలనకు జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనుల భూమి, హక్కులు, మరియు గౌరవాన్ని కాపాడే ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు.
గిరిజన సమాజంలో ఐక్యత, స్వాభిమానాన్ని మరియు ఆత్మస్థైర్యాన్ని కలిగించి 25 ఏళ్ల చిరుప్రాయంలోనే స్వాతంత్రోద్యమ పోరాటంలో అసువులు బాసినటువంటి గొప్ప గిరిజన యోధుడు శ్రీ భగవాన్ బిర్సా ముండా 150 వ జయంతిని ఘనంగా నిర్వహించామని తెలిపారు.నీమా నాయక్ తండ, పాల్తీ తండా, పర్వేదుల, జయరాం తండా, నాయన వాణికుంట తండా, చలకుర్తి, పొట్టివాని తండా, చింతపల్లి తదితర గ్రామపంచాయతీలలో ఆ మహనీయునికి ఘనమైన నివాళులను అర్పించడం జరిగిందిని తెలిపారు. గిరిజన తండాల్లో మౌలిక వసతులను కల్పించడమేఈ ఆది కర్మయోగి అభ్యాన్ పథకం ముఖ్య ఉద్దేశమని, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం యొక్క ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రతిపాదిత పనులకు అంచనాలను రూపొందించి, బడ్జెట్ ప్రతిపాదనల కొరకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వారికి పంపబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తరి రాము ఆర్డబ్ల్యూఎస్ ఏ దీక్షిత్ కుమార్, అంగన్వాడి సూపర్వైజర్ వెంకాయమ్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆయా గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు,అంగన్వాడీటీచర్లు, ఆశాలు పాల్గొన్నారు.



