ఏఈ సింధు ఆదేశాల మేరకు లైన్ క్రింద ఉన్న చెట్లను తొలగింపు
బ్రాహ్మణ కొత్తపల్లి లైన్ మెన్ జె మంగీలాల్
నవతెలంగాణ – నెల్లికుదురు
గ్రామ ప్రజలకు అంతరాయం లేని విద్యుత్తును అందించడమే విద్యుత్తు అధికారుల లక్ష్యమని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ లైన్ మెన్ జె మంగీలాల్ అన్నారు. విద్యుత్ నెల్లికుదురు ఏఈ సింధు ఆదేశాల మేరకు లైన్ కింద ఉన్న చెట్ల పొదలను తొలగించే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో విద్యుత్తు స్తంభాల వద్ద గాని వైరు క్రింద ఏమైనా చెట్లు ఉన్న ముళ్ల పోదలో ఉన్న వాటితో విద్యుత్ అంతరాయం కలుగుతుందని, వాటిని తొలగించాలని తెలిపారు.
మా ఏ ఈ సింధు అంతరాయం లేని విద్యుత్తును అందించేందుకు వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే ఆ గ్రామానికి వచ్చి చెట్లను తొలగిస్తున్నామని తెలిపారు. విద్యుత్తు పరంగానే ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకురావాలని వెంటనే సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే మేము కృషి చేస్తామని అన్నారు. కంజు మర్లు సమస్యపరంగా ఇబ్బంది పడవద్దని ఈ వర్షాకాలంలో స్తంభాల వద్దకు గాని ఎర్త్ వైరు వద్ద గాని నిలబడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం ప్రవీణ్ ,వి డబ్ల్యూ మద్ది వెంకన్న, వి డబ్ల్యు ఆసోద యాకన్నా, తదితరులు పాల్గొన్నారు.
అంతరాయం లేని విద్యుత్తును ప్రజలకు అందించడమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES