– ప్రజా సేవలో ముందున్న బుసిరెడ్డి పాండన్న…
– నిరుపేదలను అక్కున చేర్చుకొని ఆర్ధిక సహాయం
-కుల మతాలకు అతీతంగా భరోసా
నవతెలంగాణ-పెద్దవూర
ప్రజా సేవలో సమాజ సేవకుడు బుసిరెడ్డి ఫౌండేషన్ స్థాపకుడు బుసిరెడ్డి పాండన్న ముందుంటున్నారు .మండల కేంద్రంలోని నిరుపేదలను ఆయన అక్కున చేర్చుకుని ఆర్థిక సహాయాలు అందజేస్తున్నారు.నియోజకవర్గంలోని తండాలు,గ్రామాలలోని నిరుపేద కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయాలు అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు.ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా.. కుల మతాలకతీతంగా ఆర్థిక సాయాలు అందిస్తూ తన మానవత దృక్పతాన్ని చాటుకుంటున్నాడు.బుసిరెడ్డి
ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల పక్షాన నిలుస్తున్నాడు.నియోజకవర్గం వ్యాప్తంగా ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.నూతన వధూవరులకు పాండన్నా పెళ్లి కానుక,నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుకు బుసిరెడ్డి పాండన్న ప్రోత్సాహం అందిస్తున్నారు.వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.మహిళలకు ఆర్థిక చేయూతతో పాటు గ్రామాలలో ప్రతి పేదవానికి తోడ్పాటుగా ఉంటూ వినూత్న పథకాలను ప్రవేశపెట్టి ప్రజలతో మమేకమవుతున్నారు.నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలోని బడులు,దేవాలయాలతో పాటు ఏ ఇంటిలో ఆపద వచ్చిన ముందు వరుసలో నిలబడి అండగా ఆపన్న హస్తంగా ఉంటున్నాడు.అయ్యప్ప స్వాములకు అల్పాహారాలు అందిస్తూ పడిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గ్రామాలలోని ప్రజల కష్టాలు తీర్చేందుకు రోడ్డు మరమ్మతులు చేపడుతున్నారు.రైతులకు నానో యూరియా పంపిణీ,పంటలకు డ్రోన్ తో మందుల పిచికారి వంటి సరికొత్త పద్ధతులను సొంత ఖర్చులతో అందిస్తున్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా మరణించిన మృతదేహాలకు అంతిమ సంస్కారాలకు ఆత్మ భరోసా అందిస్తూనే.. ఫౌండేషన్ ద్వారా వారి బంధువులకు ఆత్మీయ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..గ్రామాలలో ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బుసిరెడ్డి పాండన్నను నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రశంసిస్తున్నారు.గత మూడేళ్లు గా క్యాలెండర్ యాడ్ ఈసారి కూడా 5000 లు యాడ్ ఇచ్చారు.
సమాజ సేవే లక్ష్యంగా.. బుసిరెడ్డి సేవల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



