Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదలకు సేవ చేయడమే లక్ష్యం..

పేదలకు సేవ చేయడమే లక్ష్యం..

- Advertisement -

– సర్పంచ్ బెక్కెరి సునీత రాజశేఖర రెడ్డి.
నవతెలంగాణ – ఊరుకొండ 

ఆపదలో ఉన్న వారికి తమవంతు సహాయ సహకారాలు అందించి అండగా ఉంటామని.. పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించి ఆదుకుంటానని ఇప్పపహాడ్ సర్పంచ్ బెక్కెరి సునీత రాజశేఖర రెడ్డి అన్నారు. గురువారం ఊరుకొండ మండల పరిధిలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన కానుగుల అంజయ్య(50) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఇప్పపహాడ్ గ్రామ సర్పంచ్బెక్కెరి సునీత రాజశేఖర రెడ్డి బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. తక్షణ సహాయం కింద 10వేల ఆర్థిక సాయం వారి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు దుబ్బ రాములు, దుబ్బ మల్లేష్, పాపిశెట్టి ప్రవీణ్, ఎన్నం కిషోర్ రెడ్డి, నాగరాజు, రాజు, రాఘవేందర్, శివ గారు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -