– ఊరుకొండ పేట సర్పంచ్ అబ్దుల్ రషీద్
నవతెలంగాణ – ఊరుకొండ
గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యం అని.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని ఊరుకొండ పేట సర్పంచ్ అబ్దుల్ రషీద్ అన్నారు. శనివారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట గ్రామంలోని కప్పర చంద్రయ్య ఇంటి నుండి పెద్దోళ్ల వెంకటయ్య ఇంటి వరకు దెబ్బతిన్న అండర్ డ్రైనేజీ పైపులైన్ల మరమ్మతు పనులను పర్యవేక్షించారు. గత కొంతకాలంగా డ్రైనేజీ పైపులు పూడిపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తోందని.. గమనించిన సర్పంచ్ మరమ్మతులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. గ్రామంలో మురుగునీటి సమస్య లేకుండా చూసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేపాని శ్రీనివాసులు, నాయకులు అజహర్, తిరుపతయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



