- సర్పంచ్ సింగపంగా లక్ష్మమ్మ ఎల్లయ్య
నవతెలంగాణ-మునుగోడు: కల్వకుంట్ల గ్రామంలో గత కొంతకాలంగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తామని కల్వకుంట్ల గ్రామ సర్పంచ్ సింగపంగా లక్ష్మమ్మ ఎల్లయ్య సోమవారం వార్డు సభ్యులు , గ్రామ ప్రజలు, యువకులతో కలిసి వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించారు. ప్రధానంగా కల్వకుంట్ల గ్రామంలో వీధి దీపాలు, శిథిలావస్థలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలను గుర్తించామని తెలిపారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తక్షణమే తొలగిస్తామన్నారు. గ్రామంలో డ్రైనేజీలలో చెత్త పేరు పోయిందని, కొన్నిచోట్ల మురుగునీరు వెళ్లకుండా చేత్తా అడ్డుపడడం వంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
త్రాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పై ప్రధానమైన దృష్టితో, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, సేవలను అందిస్తానని అన్నారు. గ్రామానికి అవసరమైన కొత్త కరెంటు స్తంభాల మంజూరుకు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్త స్తంభాలను ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఐతగోని యాదయ్య, మేక ప్రత్యూష నవీన్ రెడ్డి, మేక మాధవి ప్రదీప్ రెడ్డి, గ్రామ పెద్దలు నారబోయిన నరసింహ, మాదరబోయిన పరమేష్, సింగపంగా అశోక్, మేక బాసిరెడ్డి, పగిళ్ల మధు, సింగపంగా యాదయ్య, క లింగస్వామి, నార బోయిన లాలు, కట్ట రామకోటి గ్రామ యువకులు ఇరుగుదొండ్ల గణేష్, చేకూరి ప్రేమ్ సాగర్, నారబోయిన పవన్, కుక్కల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


