Friday, February 27, 2026
E-PAPER
Homeకరీంనగర్అంగన్వాడీల బలోపేతమే లక్ష్యం

అంగన్వాడీల బలోపేతమే లక్ష్యం

- Advertisement -

-పిల్లలకు నాణ్యమైన విద్యాసదుపాయాలు కల్పిస్తాం: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
నవతెలంగాణ-రాయికల్

మండలంలోని కిష్టంపేట గ్రామంలో రూ.12 లక్షల నిధులతో అంగన్వాడి నూతన భవన నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయని, పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు ప్రైవేట్ ప్లే స్కూల్‌ల తరహాలో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన అందించేలా అంగన్వాడీల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని, రైతు భరోసా నిధులు త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. ఏకకాలంలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.విద్య ద్వారా సామాజిక అసమానతలు తొలగిపోతాయని, ఎవరు దోచుకోలేనిది విద్య మాత్రమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు.

ఇటీవల ఎంజిఎన్ఆర్ఈజిఎస్ పేరును మార్చి నిబంధనలు కఠినతరం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనుల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బింగి చిరంజీవి,ఎంపీవో సుష్మా,డి.ఈ.మిలింద్,ఏఈ ప్రసాద్,సీడీపీఓ మమత,సర్పంచ్ ఆకుల అంజన్న,నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -