కాంగ్రెస్ పార్టీ కమిటీల ఎన్నికలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలి
పార్టీకి అంకితమై పనిచేసే వారు ముందుకు రావాలి
నవతెలంగాణ – పరకాల : బూతు స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల టౌన్, పరకాల, నడి కూడ మండలాల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , టీపీసీసీ అబ్జర్వర్ మక్సుధ్ అహ్మద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాడర్ బేసిక్ ఎన్నికలే పార్టీకి పునాది అని,సామాజిక సమీకరణ సంస్థాగత నిర్మాణం ముఖ్యమన్నారు.సెలెక్టెడ్ ఎలెక్టెడ్ సిస్టంతో పార్టీ కమిటీలో నియామకం జరుపాలన్నారు. రాబోయే సంస్థ గత ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు,క్యాడర్ బాగుంటే పార్టీ బాగుంటుంది అని చెప్పడానికి పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నిదర్శనమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.క్యాడర్ కృషితోనే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ పెరిగిందన్నారు.కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం మని అందులో భాగంగానే కులగనను చేయడం జరిగిందన్నారు.కాంగ్రెస్ పార్టీలో క్యాడర్కు గౌరవం ఉందని,పార్టీ జెండా పట్టి పార్టీని గెలిపించే వారే నిజమైన కాంగ్రెస్ వాది అన్నారు.క్రింది స్థాయి నుండి వస్తేనే నాయకులుగా ఎదుగుతారని తెలిపారు. నియోజకవర్గంలో గ్రూపులు కట్టి పార్టీకి నష్టం చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. కష్టపడ్డా కార్యకర్తకే పార్టీ గుర్తింపు లభిస్తుందన్నారు. 2017కు ముందు నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ లో కష్టపడ్డ వారికి బ్లాక్ అద్యక్షులు, మండల, వార్డు,గ్రామ అధ్యక్షులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్, సమన్వయ కమిటీ నాయకులు సోదర రామకృష్ణ, నాయకులు అల్లం రఘునారాయణ, చిన్ని, బొచ్చు చందర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -