Tuesday, July 1, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజల ఆరోగ్య రక్షణే వైద్యుల ధ్యేయం..

ప్రజల ఆరోగ్య రక్షణే వైద్యుల ధ్యేయం..

- Advertisement -

డాక్టర్ జక్కారవి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ప్రజల ఆరోగ్య రక్షణీ వైద్యు ధ్యేయం అని ప్రుడెన్స్ హాస్పిటల్ ఎంబిబిఎస్, ఎండి జనరల్ ఫిజీషియన్ , క్రిటికల్ కీర్ అండ్ డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ జక్కా రవి అన్నారు. రేపు డాక్టర్స్ డే సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తిని ఎంచుకోవడం అంటే ప్రజలకు అండగా ఉంటామని, అర్ధ ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తామని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఎదురునిలిచి పోరాడిన ఘనత వైద్యులకే దక్కిందన్నారు. సమాజంలో వైద్యులను దైవంగా భావిస్తారని తెలిపారు.

అలాంటి వృత్తిలో ఉంటూ నిత్యం ప్రజల ప్రాణాలకు కాపాడుతున్న వైద్యుల చేస్తున్న సేవలు మరవలేనివని అన్నారు. వారికి ప్రజలంతా సహకరించి నైతిక మద్దతు అందించాలని కోరారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు అంకింత భావంతో పనిచేస్తారని తెలిపారు. రోగులకు శ్రేయస్సును వైద్యులు కోరుకుంటారని, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముందుంటారని స్పష్టం చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగికి చికిత్స అందించి ఆరోగ్యవంతులగా తీర్చిదిద్దేవరకు వైద్యులు అందించే సేవలు అమూల్యమైనవని తెలిపారు. రేపు అంతర్జాతీయ డాక్టర్స్ డే ను పురస్కరించుకొని వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -