Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

- Advertisement -

– సర్పంచ్ జర్పులావత్ రమేష్ నాయక్
నవతెలంగాణ – ఊరుకొండ 

బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని గుండ్లగుంటపల్లి సర్పంచ్ జర్పులావత్ రమేష్ నాయక్ అన్నారు. శనివారం ఊర్కొండ మండలం గుండ్లగుంటపల్లి గ్రామంలో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్పంచ్ జర్పులావత్ రమేష్ నాయక్ అధ్యక్షతన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఫలాలు అందుతున్నాయని.. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని.. స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -