Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జ్ఞాన సమాజ నిర్మాణమే స్వేరో లక్ష్యం 

జ్ఞాన సమాజ నిర్మాణమే స్వేరో లక్ష్యం 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
ఉన్నత శిఖరాలను అధిరోహించడమే స్వేరో లక్ష్యం అని నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బండమీది కృష్ణ అన్నారు. మండల కేంద్రంలో స్వేరో మీటింగ్ పసుల పాపయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. జ్ఞాన సమాజ నిర్మాణం,ఉన్నత శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా స్వేరో పనిచేస్తుందన్నారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం, ఆత్మ గౌరవం, బడుగు బలహీన పేద వర్గాల విద్యార్థులను, కులమత వర్గ ,ప్రాంతాల తారతమ్యము లేకుండా అభివృద్ధి వైపు ప్రయాణించేలా కృషి చేస్తున్నామన్నారు. స్వేరో గ్రామ కమిటీల నిర్మాణాన్ని చేపడుతూ గ్రామ గ్రామాన స్వేరో పదాన్ని ,విధివిధానాలను పరిచయం చేస్తూ ప్రాధాన్యం అక్షరానికి ఇవ్వాలని విజయ సంకేతానికి దిక్సూచిగా, సమాజం మార్పు అంటేనే స్వేరో అనే విధముగా పనిచేయాలని సూచిస్తున్నామన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండాలని మండల స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కో కన్వీనర్ విజయ్ కుమార్ స్వేరో మండల అధ్యక్షులు పసుల పాపయ్య,జనరల్ సెక్రటరీ రాజు ,రమేష్, రాంబాబు,రవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -