ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతుకు మద్దతు ధర
రైతు సంక్షేమమే ధ్యేయం
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవాలి
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
రైతును రాజును చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తొర్రూరు సొసైటీ ఆధ్వర్యంలో తొర్రూరులో, ఐకెపి ఆధ్వర్యంలో తీగారంలో, పాలకుర్తి సొసైటీ ఆధ్వర్యంలో వల్మిడీలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతన్న పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని అన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ ధాన్యానికి 2369 రూపాయలను క్వింటాలుకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం ఆరబెట్టుకొని తాలు లేకుండా, తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మాత్రమే తీసుకురావాలని రైతులకు సూచించారు.
రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు లాభం తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. గతంలో క్వింటాలుకు రెండు నుండి ఐదు కిలోలు కటింగ్లు చేసి రైతులను మోసం చేసే వారిని తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో కొనుగోలు కేంద్రాల ద్వారా కేజీ కూడా కటింగ్ కావడం లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరిగిన సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అకాల వర్షాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని గుర్తు చేశారు. రైతులను ఆదుకునేందుకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కిందన్నారు. పెట్టుబడి సహాయం కింద రైతులకు రైతు భరోసాను అందించి ఆదుకుంటున్నామని తెలిపారు. సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ అందించి దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యూరియా కొరత తలెత్తిందని తెలిపారు.
అవసరం ఉన్నంత యూరియాను వాడుకుంటే యూరియా కొరత ఉండబోదని, అవసరానికి మించి యూరియా వాడుతున్నారు కాబట్టే యూరియా కొరత ప్రారంభమైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతను రాష్ట్ర ప్రభుత్వం వల్లే జరుగుతుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అవసరమేరా యూరియాను రైతులు వాడుకోవాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని తెలిపారు. మూడో విడత నాటికి నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదలు ఉండరాదని స్పష్టం చేశారు. మొదటి విడతలో 3,500 నియోజకవర్గానికి మంజూరై ప్రారంభమయ్యాయని తెలిపారు.
గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. తీగారంలో గల ధాన్యం రాసి పై మూడు రంగులతో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అనే వ్రాసి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి రైతు నాగలిని అందజేశారు. తీగారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, తొర్రూరు, పాలకుర్తి సొసైటీల చైర్మన్లు గోనే మైసిరెడ్డి, బొబ్బల అశోక్ రెడ్డి, తహసిల్దార్ నాగేశ్వర చారి, ఎంపీడీవో రవీందర్, డిఆర్డిఏ డి పి ఎం జన్ను ప్రకాష్, ఏపీఎం శ్రీరాముల చంద్రశేఖర్, పాలకుర్తి సొసైటీ వైస్ చైర్మన్ కారుబోతుల వేణు, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు గునిగంటి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బేజాడి సుమలత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరాగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, మాజీ సర్పంచు పోగు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బీసు లలిత, నాయకులు నీరటి చంద్రయ్య, వాసూరి రవి, లోనే శ్రీనివాస్, బండిపెళ్లి మనమ్మ, కమ్మగాని నాగన్న గౌడ్, పెనుగొండ రమేష్, చిలువేరు సంపత్ లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐకెపి సీసీలు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రైతును రాజును చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES