నవతెలంగాణ ఆర్మూర్
పట్టణంలో శనివారం జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. పదో వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి ధోండి రమణ పాల్గొన్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల మధ్య నిరంతరం ఉంటున్నారు. సమస్య ఎక్కడున్నా ముందుండి స్పందించే నాయకుడిగా, అవసరమైతే అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించే వ్యక్తిగా ఆయన తనదైన ముద్ర వేసుకుంటున్నారు.
వార్డు అభివృద్ధి, పేదల సంక్షేమం, యువతకు అవకాశాలు, మహిళల భద్రత వంటి అంశాలపై స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. మాటలకే పరిమితం కాకుండా, పనితోనే నమ్మకం కలిగించే వ్యక్తిత్వం ధోండి రమణది. ప్రతి అవకాశాన్ని అంది పుచ్చు కుంటున్నారు
ప్రజలతో కలిసి నడిచే నాయకుడిగా, ప్రతి అవకాశాన్ని పదో వార్డు అభ్యున్నతికి ఉపయోగించుకుంటున్న ధోండి రమణ గెలుపు అంటే ప్రజల గెలుపే. నిన్న నిజాంసాగర్ కాల్వలో పడి మూడు సంవత్సరాల పాప గీత మృతిచెందడంతో వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఎంతో అండదండగా నిలిచి వారికి తమ వంతు ఆర్థిక సహాయం చేశారు అటు భగవంతుని సేవలో ఇటు ప్రజల సేవలో నిమగ్నమైపోయారు.



