Monday, January 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యం ఓ మైలురాయి

ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యం ఓ మైలురాయి

- Advertisement -

– కేంద్ర కార్మిక రాజ్యం బీమా సంస్థ ప్రాంతీయ డైరెక్టర్‌ రాజీవ్‌లాల్‌
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే భారత ప్రభుత్వ లక్ష్యంలో 2026 సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయి అని కేంద్ర కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రాంతీయ డైరెక్టర్‌ రాజీవ్‌లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశం అపూర్వమైన పురోగతి సాధించినప్పటికీ, మన 77వ సంవత్సరంలో ఇంకా కొన్ని సవాళ్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పు, నిరుద్యోగం, విద్యా స్థాయిలను మెరుగుపరచడం తదితరాంశాలను కొనసాగించాల్సిన అవసరముందని గుర్తు చేశారు. గణతంత్ర రాజ్యంగా, పౌరుడి బాధ్యత ఓటు వేసేందుకు పరిమితం కాకూడదనీ, కానీ దేశాభివృద్ధిలో చురుకుగా పాల్గొనడం కూడా చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో భారత రాజ్యాంగం చట్టపరమైన పత్రం మాత్రమే కాదనీ, లక్షలాది మంది భారతీయుల ఆశల సజీవ స్వరూపం అని ఆకాంక్షించారు. రాజ్యాంగం ఆదర్శాలను, మన ఆలోచనలను పరస్పరం పంచుకోవాలనీ, అందుకు కలిసి నడుద్దామని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -