Sunday, December 14, 2025
E-PAPER
Homeసోపతితెలుగు ప్రజల హదయేశ్వరి 'మల్లీశ్వరి'

తెలుగు ప్రజల హదయేశ్వరి ‘మల్లీశ్వరి’

- Advertisement -

తెలుగు చలనచిత్ర చరిత్రలో స్వర్ణ యుగానికి చెందిన గొప్ప చిత్రంగా మల్లీశ్వరి ఖ్యాతి గాంచింది. ఆ సినిమా భారతదేశం లోనే కాక ఇతర దేశాలలో కూడా చాలా రోజుల పాటు ప్రదర్శింప బడింది. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనాలోనే వంద రోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయా గ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్‌.రెడ్డి నడిపించినవే. అందుకే కష్ణశాస్త్రి ”మల్లీశ్వరి సష్టిలో మేమంతా నిమిత్త మాత్రులం. బి.ఎన్‌.రెడ్డి దీనికి సర్వస్వం” అన్నారు. మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం.
శ్రీకష్ణదేవ రాయలంటే ఆరాధనాభావమున్న, ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తతంగా అధ్యయనం చేసిన బి.ఎన్‌.రెడ్డి రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు. బి.ఎన్‌. తమ తొలి సినిమా ‘వందేమాతరం’ షూటింగు కోసం హంపి ప్రాంతానికి వెళ్ళినప్పటి నుండి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే ఉన్నారు. ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లీలో వచ్చిన ఒక కథ, బుచ్చిబాబు రాసిన ‘రాయల కరుణ కత్యం’ నాటిక కలిపి దేవులపల్లి కష్ణశాస్త్రి చేత ‘మల్లీశ్వరి’ స్క్రిప్టుగా అభివద్ధి చేశారు. అయితే బుచ్చిబాబు పేరు కథా రచయితగా సినిమాలో స్థానం కల్పించలేదు.
వాహినీ వారి మల్లీశ్వరి. ఇది దేవులపల్లి వారి తొలి సినిమా. అయన పాటలు – మాటలు, ర’సాలూరు’ రాజేశ్వరరావు కమ్మని బాణీలు, ఎన్‌.టి.ఆర్‌., భానుమతిల అద్భుత నటన, ఘంటసాల – భానుమతి గార్ల విలక్షణమైన గాన పటిమ అన్నీ కలబోసిన రాగేశ్వరి మల్లీశ్వరి. శ్రీ కష్ణ దేవరాయలు పాలించే విజయనగరానికి సమీపాన నివసించే పల్లెటూరి యువ ప్రేమికులు మల్లి, నాగరాజు. తెలియక వెటకారానికి, మారువేషంలో వున్న రాయలు, పెద్దనలతో రాణివాసం పల్లకి కోరి, తద్వారా ప్రేమికులు విడిపోయి, విరహ వేదన అనుభవిస్తారు. అలనాడు మహాకవి కాళిదాసు ప్రేమికుల సంకేతాలను ‘మేఘ సందేశం’ గా రచించగా, ఈ చిత్రంలో నాయికా నాయకుల నడుమ తొణికిసలాడే ప్రణయ స్పందనా తరంగాలను ‘ఆకాశ వీధిలో హాయిగా’ తేలియాడే మబ్బు తునకతో పంపారు కష్ణ శాస్త్రి. అంతేకాదు ఈ మల్లీశ్వరి మేఘమాల నిజంగానే దేశదేశాలు తిరిగింది, చైనాతో సహా. సాలూరికి ఇష్టమైన చక్కని ఈ పాటను రాగ మాలికగా భీంపలాస్‌, కీరవాణి, హంసానంది రాగాలలో కూర్చి ఘంటసాల, భానుమతి గార్లతో అందాల ఓ మేఘమాల పాట పాడించారు సాలూరు వారు.
నందమూరి తారక రామారావు, భానుమతి, సురభి కమలాబాయి, బేబీ మల్లిక, మాస్టర్‌ వెంకటరమణ, న్యాపతి రాఘవరావు, ఋష్యేంద్ర మణి, శ్రీవాత్సవ, కుమారి, వంగర, కమలాదేవి తదితరులు తమ పాత్రలలో ఒదిగి పోయారు.
చక్రవర్తి శ్రీకష్ణ దేవరాయలు పరిపాలన నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. అప్పటి రాజవిధానం ప్రకారం రాజాంతఃపురంలో పనిచేయడానికి ఇష్టపడిన యువతులను వారింటికి పల్లకీ పంపి, వారి కుటుంబానికి ధన కనక బహుమానాలు ఇచ్చి, రాజాస్థానానికి పిలిపించే వారు. కాని ఒకసారి అంతఃపురంలో చేరిన యువతులకు బయటి మగవారితో సంబంధాలు నిషిద్ధం. ఈ నియమాన్ని అతిక్రమించిన వారికి ఉరిశిక్ష వేసేవారు.
చిత్రంలో పాటలు అన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. ”లంబోదర లకుమికరా – పురందర దాసు కీర్తన, ”కోతీ బావకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట”, ”పిలచిన బిగువటరా ఔరౌరా ఔనా! నిజమేనా! మరతునన్నా మరువలేను”, ఉషా పరిణయం యక్షగానం- కమలాదేవి, భానుమతి ”పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి”, ”మనసున మల్లెల మాలలూగెనే, ”ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు”, ”ఎన్నినాళ్ళకీ బతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో”, ”ఝుం ఝుం ఝుం తుమ్మెదా తుమ్మెదా” తదితర పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఒక సంప్రదాయ గానం, మరొక పురందరదాసు కీర్తన (గణేశ ప్రార్థన) తప్పించి మిగిలినవన్నీ దేవులపల్లి కష్ణశాస్త్రి రచనలే. స్త్రీలను ఆకర్షించేందుకు భక్తి పాటలను ఏదో విధంగా చొప్పించే రోజుల్లో ఈ సినిమాలో టైటిల్స్‌ శ్రీగణనాథం అనే గీతం తప్ప మిగతా పాటలన్నీ సినిమాకు ముఖ్య కథాంశమైన అనురాగం, ప్రణయం, రెండవ థీం అయిన విజయనగర వైభవం చుట్టూ ఉండేలా రూపొందించారు. మొత్తం పాటల స్వరకల్పనకు ఆరు నెలల కాలం పట్టింది.
సినిమాలో మల్లీశ్వరి, నాగరాజు ముందు ప్రదర్శించిన నత్య గానాలను మారువేషంలో చూసిన అల్లసాని పెద్దన ఆశువుగా ఆమెను మెచ్చుకుంటూ ఓ పద్యం చెప్పే సన్నివేశం ఉంది. అల్లసాని పెద్దన రాసినట్లుగా అల్లిక జిగిబిగితో రావాలన్న జాగ్రత్త వల్ల కష్ణశాస్త్రితో 108 పద్యాలు రాయించుకుని అందులో ఒక్కటి ఎంపిక చేసుకున్నారు బి.ఎన్‌.రెడ్డి.
మల్లీశ్వరి చలనచిత్రం ద్వారా చిత్రరంగానికి ప్రముఖ కవి, భావకవితోద్యమంలో ముఖ్యుడైన దేవులపల్లి కష్ణశాస్త్రిని పరిచయం చేశారు.
ఈ చిత్రాన్ని సర్వేపల్లి రాధాకష్ణ చూశారు. ఆయన గమనించిన విషయం – చిత్రంలో మల్లి, నాగరాజులు, మారువేషంలో ఉన్న రాయలవారిని కలిసింది పెద్దవర్షం వచ్చిన కారణంగా. ఐతే రాయలవారు వీరితో మాట్లాడి తిరిగి వెళ్ళిపోయే సమయంలో గుర్రాల స్వారీ వల్ల ధూళి రేగుతుంది. ఇది ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.

  • రామకిష్టయ్య సంగనభట్ల, 9440595494
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -