Tuesday, May 13, 2025
Homeజాతీయంగెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: ఏపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి పారితోషికాలను గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (జీఓ) జారీ చేసింది. పెంచిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా విడుదల చేసిన జీఓ ప్రకారం, గెస్ట్ లెక్చరర్లకు ప్రస్తుతం గంటకు చెల్లిస్తున్న రూ.150 పారితోషికాన్ని రూ.375 కు పెంచారు. దీంతో పాటు, నెలకు గరిష్టంగా పొందగల వేతనాన్ని రూ.27,000గా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 1,177 మంది గెస్ట్ లెక్చరర్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -