- Advertisement -
- మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి
నవతెలంగాణ – రామారెడ్డి
రైతులపై ముసలి కన్నీరు కారుస్తు, ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని, కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డికి రైతులు పలు గ్రామాల్లో యూరియా అంధకా నిరసన తెలుపుతున్నారని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ…. పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలనలో రైతులకు నాణ్యమైన విద్యుత్ తో పాటు, విత్తనాలు, రసాయన ఎరువులను అందించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. వరద బాధితులను, రైతులను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కావలసిన రసాయన ఎరువులు యూరియాను అందుబాటులో ఉంచకపోవడంతో, రైతులు నష్టపోతున్నారని, దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నందున వెంటనే ప్రభుత్వం రైతులకు కావలసిన యూరియాను అందుబాటులో ఉంచి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసనలను చేపట్టి, గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలను తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -