Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడులపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు

ప్రభుత్వ బడులపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు

- Advertisement -

కోటగల్లి ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ సమస్యలు పరిష్కరించాలనీ స్కూల్ ఎదుట పిడిఎస్యూ భారీ ధర్నా
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

ప్రభుత్వ స్కూల్స్ పై ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఏ మాత్రం లేదని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో కోటగల్లి ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో స్కూల్ విద్యుత్ వైర్లకు పట్టుకొని విద్యార్థి మరణించిన విద్యాశాఖ అధికారుల కి స్కూలుకు కొత్త బిల్డింగ్ కట్టాలని ద్యాస రాలేదని నూతన బిల్డింగ్ కట్టాలని అన్నారు. 600 పైగా ఉన్న విద్యార్థులకు పాత బిల్డింగ్ లో రేకులు వేసి రెండు ఫ్యాన్స్ మాత్రమే ఉన్నాయని, రేకుల వేడి కి అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ క్లాసులు వినలేకపోతున్నారని తెలిపారు.

శిధిలావ్యవస్థలో ఉన్న ఏడు బాత్రూమ్ లు విద్యార్థులు అవస్థలు పడుతూ ఉపయోగిస్తున్నారని, యూనిఫామ్ ఒకటే జత వచ్చిందని, కొన్ని క్లాస్ రూమ్స్ లలో బెంచీలు లేచా విద్యార్థులు నేలమీద కూర్చుంటున్నారని బెంచీలు ఏర్పాటు చేయాలని , గ్రౌండ్ క్లిన్ చేయాలని,క్లాస్ రూమ్స్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, వేల కోట్లు ఉచిత పథకాలకు కేటాయిస్తున్నారు కానీ చదువుకునే విద్యార్థులకు సదుపాయాలు కల్పించడానికి బడ్జెట్ కేటాయించటం లేదని అన్నారు. ఉపాధ్యాయులు సమయానికి రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ కార్తీక్, జిల్లా నాయకులు నిఖిల్ నగర నాయకులు సాయికిరణ్,దుర్గాప్రసాద్, వంశీ,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -