ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను పున:పరిశీలించాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతుల భూముల్ని, జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన త్రిబుల్ ఆర్ బాధిత రైతులు రాంచందర్‌రావును కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్ వల్ల తమకు జరిగే నష్టం గురించి వివరించారు. జీవనోపాధి పోతుందని మొరపెట్టుకున్నారు. దక్షిణ భాగం అలైన్‌మెంట్ మార్పు వల్ల సాగు భూముల్ని కోల్పోతున్నామని వాపోయారు. ప్రస్తుతం ఖరారు చేసిన దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను రద్దు చేసి పున: సర్వే చేసేలా రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తేవాలని కోరారు. పక్కనే ఉన్న రాచకొండ గుట్టలను రహదారి కోసం వినియోగిస్తే పంట భూముల్ని కాపాడుకోవచ్చునని చెప్పారు. రైతుల గోడును విన్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు చొరవ తీసుకుంటానని ఈ సందర్భంగా రాంచందర్‌రావు హామీ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను పున్ణసమీక్షించి రైతులకు నష్టం లేకుండా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రైతుల భూముల్ని, జీవనోపాధిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES