Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు

ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు

- Advertisement -

పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ఎమ్మెల్యేకు నీరాజనం కలిగిన స్థానిక గ్రామస్తులు
నవతెలంగాణ – రాయపర్తి
మన రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళు అని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం తమ వద్దు అని తెలిపారు. రాయపర్తి మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సాయశక్తిన కృషి చేస్తున్నానని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి అన్ని రంగాలలో దూసుకుపోతుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శుభ్రం చేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, గోవర్ధన్ రెడ్డి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, మచ్చ నీలయ్య, కోతి కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -