- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్‌గా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘ప్రభుత్వ భూములు లాక్కోవడం ఇదే మొదటిసారి కాదు. జయశంకర్ వర్సిటీ నుంచి వందెకరాలు తీసుకున్నారు. వర్సిటీ భూములపై విద్యార్థులు పోరాడినా ఆందోళనను అణచివేశారు. హెచ్‌సీయూకు చెందిన 400 ఎకరాలను తీసుకునే ప్రయత్నం చేశారు’’ అని అన్నారు. ఉర్దూ వర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వ నోటీసుల దృష్ట్యా కేటీఆర్ ఆ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయ్యారు.
- Advertisement -



