నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ చెల్లించే విషయంలో రైతులను మోసం చేస్తుందని పలువురు రైతులు విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమ్మర్ పల్లి రైతులు మాట్లాడారు.ఇటీవల గ్రామంలో సన్న వడ్ల కొనుగోలును చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామంలో ఇప్పటివరకు వాళ్లు చెల్లిస్తామన్న సన్న వడ్ల బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయలేదనరేష్. జమ చేసినట్టుగా తెలుపుతూ కాలం గడుపుతూ ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదని, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని రైతులందరూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కొందరి రైతులకు రుణమాఫీ, కొందరు రైతులకు రైతు భరోసా, ఇస్తూ రైతులను విభజించి పాలిస్తున్నట్లు ఈ ప్రభుత్వం తీరు ఉందన్నారు. అందరికీ అన్ని చేస్తున్నామని వింత పోకడకు పోతుందని, విమర్శించారు. తక్షణమే రైతుల ఖాతాలో సన్న వడ్లకు బోనస్ డబ్బులు జమ చేయాలని, లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా రాస్తారోకో చేపడతామని కమ్మర్ పల్లి గ్రామా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో రైతులు సంత నడిపి రాజేశ్వర్, గడ్డం నర్సారెడ్డి, మల్కాయి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.



