Wednesday, October 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేవాదుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

దేవాదుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

- Advertisement -

ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమే సర్కారు సంకల్పం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
జే.చొక్కారావు-దేవాదుల ప్రాజెక్‌ పూర్తికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న కర్తవ్యమని వ్యాఖ్యానించారు. జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పధకం పురోగతిపై మంగళవారం డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేదక్కర్‌ సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయత్‌ రాజ్‌ శాఖామంత్రి దపసరి అనసూయ సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యేలు నాగరాజు, యశశ్వని రెడ్డి, సత్యనారాయణ రావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సలహాదారుడు ఆదిత్య నాధ్‌ దాస్‌, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్‌, ఈఎన్సీలు అంజద్‌ హుస్సేన్‌, రమేష్‌బాబు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నిర్ణీత కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.పాలనాపరమైన అడ్డంకులను సత్వరం తొలగించి పెండింగ్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జయశంకర్‌ భూపాల్‌ పల్లి జిల్లా గంగారాం గ్రామ సమీపంలోని గోదావరి నది నుండి 38.16 టీఎంసీల నీటిని వరంగల్‌, హనుమకొండ, కరీంనగర్‌, జయశంకర్‌ భుపాలపల్లి, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి. సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలలో 5.57 లక్షల ఏకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆయన వివరించారు. 71 మీటర్ల ఎత్తు నుంచి 540 మీటర్ల ఎత్తు వరకు, మొత్తం 469 మీటర్ల మేర ఎత్తిపోతల పథకమన్నారు. పంప్‌ హౌస్‌ లు, కాలువల తవ్వకాలు, నీటి సరఫరా తదితర పనులు పూర్తి చేసేందుకు గాను మూడు దశల్లో పనులు జరుగుతున్నాయన్నారు. 5.56 లక్షల ఎకరాలను సాగులోకి తేవడానికి ఉద్దేశించబడిన ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 3.17 లక్షల ఏకరాలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు. భూగర్భజలాలతో సాగులో ఉన్న 58,028 ఎకరాల విస్తీర్ణంతో కలుపుకుంటే మొత్తం ఆయకట్టు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.18,500 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.14,269,63 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆయన వెల్లడించారు. మిగిలిన పనుల పూర్తికి రూ.4,230 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఖర్చు చేసిన మొత్తంలో నిర్మాణానికి గాను రూ. 11,667.85 కోట్లు ఖర్చు చేయగా భూసేకరణ నిమిత్తం 1,343.06 కోట్లు ఖర్చు పెట్టమన్నారు. అంతే గాకుండా హైడ్రో-మెకానికల్‌-విద్యుత్‌ అవసరాల నిమిత్తం రూ. 1,170.63 కోట్లు ఖర్చు పెట్టమన్నారు. 2,430 కిలోమీటర్ల కాలువ తవ్వల్సి ఉండగా 1,663.10 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తి అయ్యాయని చెపాపరు. అలాగే 702.62 కిలోమీటర్ల పైపులైన్‌కు గాను ఇప్పటికి 669.66 కిలోమీటర్ల మేర పూర్తి చేశారని వివరించారు. కాలువల లైనింగ్‌ కుడా 799.80 కిలో మీటర్లు పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు. 46 ట్యాంక్‌లకు గాను 39 పూర్తి కాగా, 21 పంప్‌హౌజ్‌లలో 18 ట్యాంకులు పురోగతిలో ఉన్నాయన్నారు. అధికారికంగా అందించిన గణాంకాల ఆధారంగా వివిధ విభాగాలలో 67 శాతం నుంచి 95 శాతం మేర పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

ప్రాజెక్టు మొదటి దశలో సాలీన 170 రోజుల పాటు 5.18 టీఎంసీ నీటిని పంపిణీ చేయగా 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు సమద్ధిగా అందుతుందన్నారు. రెండో దశలో 7.25 టీఎంసీల నీటితో మరో 1.83 లక్షల ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నామన్నారు కొత్తగా పంప్‌హౌజ్‌ లు, సొరంగాలు, రిజర్వాయర్‌ ల నిర్మాణాల ద్వారా 25.75 టీఎంసీల నీటిని 2.39 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు మూడవ దశలో పనులు నడుస్తున్నాయన్నారు. అందుకు గాను దీనిని ఎనిమిది ప్యాకేజ్‌ లుగా విభజన చేసి పనులు మొదలు పెట్టగా ప్యాకేజ్‌-1, ప్యాకేజ్‌-2 పూర్తి అయ్యాయన్నారు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయాన్నారు. దేవాదుల ప్రాజెక్టుతెపాటు దాని అనుబంధ కాలువల కింద ఆయకట్టు ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలోని బహుళ నియోజకవర్గాలలో విస్తరించి ఉందన్నారు.

జనగాం జిల్లాలో, రఘునాథపల్లి, ఆర్‌.ఎస్‌. ఘనపూర్‌ విభాగాలలో 51,000 ఎకరాలతో సహా సుమారు 88,000 ఎకరాలకు సాగునీరు అందుతుం దన్నారు. తాటికొండ, కొత్తపల్లి, మీదికొండ, రాఘవాపూర్‌, చాగల్‌, అశ్వారాపల్లి , గోవర్ధనగిరి ఏడు గ్రామాలలో కేవలం గాంధిరామారం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ సుమారు 5,600 ఎకరాలకు నీరందిస్తుందన్నారు. హనుమకొండ, వరంగల్‌ నియోజకవర్గాలలో, ఆయకట్టు సామర్థ్యం 1.1 లక్షల ఎకరాలను మించిపోయింది, ములుగు, భూపాలపల్లి, జైశంకర్‌ విభాగాలు కలిపి 1.2 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయన్నారు.మిగిలిన ఆయకట్టు సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలలో పంపిణీ చేయబడిందన్నారు. తద్వారా ఈ ప్రాజెక్టు ఉత్తర, మధ్య తెలంగాణ రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.భూసేకరణ నివేదిక ప్రకారం, అవసరమైన 34,386 ఎకరాలకు గాను 32,079 ఎకరాలను సేకరించారు, కేవలం 2,307 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది, ఇది ప్రధానంగా మూడవ దశ భాగాలలో ఉందన్నారు. ఖర్చు చేసిన ప్రతి రూపాయి పొలాలలోకి నీరు ప్రవహించేలా చేయాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -