Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంజర్నలిస్టుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..

జర్నలిస్టుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..

- Advertisement -

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం..
నవతెలంగాణ – మణుగూరు
జర్నలిస్టుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండదని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం సింగరేణి ఇల్లందు క్లబ్ లో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్న జర్నలిస్ట్ డే వేడుకలలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ..  ప్రజా సమస్యలపై జర్నలిస్టులు నిర్భయంగా వార్తలు రాయాలన్నారు .అన్నివేళలో ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజా సమస్యలపై వార్తలు రాయాలని కోరారు. మణుగూరు ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించి క్లబ్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గస్థాయిలో జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి ముందుకు సాగాలన్నారు.

జర్నలిస్ట్ ఐక్యత ప్రజాస్వామ్యానికి అవసరమని మణుగూరు  డి.ఎస్.పి అన్నారు వి రవీంద్రారెడ్డి అన్నారు ప్రభుత్వం అంటే చట్టసభలు , ప్రభుత్వ యంత్రాంగం ఈ రెండు వ్యవస్థలను నియంత్రించే న్యాయశాఖ, నాలుగో స్తంభం జర్నలిజం అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం జర్నలిజం అన్నారు. పత్రికలలో వచ్చే ఎనాల్సిస్ వలన ప్రభుత్వాలు పనిచేస్తాయన్నారు అనంతరం సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ మాట్లాడుతూ.. నిరంతరం సింగరేణి కార్మికుల సమస్యలు మరియు అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.

పర్యావరణ పై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం నిర్వహించే ప్రెస్ మీట్ విలేకరులు చైతన్యవంతమైన సమస్యలను వెలుగులోకి తెస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ 2 జిఎం బి శ్రీనివాసచారి, డి జి ఎం పర్సనల్ సలగల రమేష్, మున్సిపల్ చైర్మన్ ప్రసాద్, తాసిల్దార్ నరేష్, సీఐ పీ నాగబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు దోసపాటి వెంకటేశ్వరరావు, దండా రాధాకృష్ణ, ఎంపీ ఓ పలనాటి వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు దామల్ల వెంకన్న, ఈరెల్లి కిషోర్, అధ్యక్షులు పిండిగా వెంకట్, ప్రధాన కార్యదర్శి మార్త శ్రీనివాస్, కోశాధికారి ఎస్ డి సాబీర్ పాషా, అధిక సంఖ్యలో ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad