Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్కారు చెట్లపై గొడ్డలి వేటు..

సర్కారు చెట్లపై గొడ్డలి వేటు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
హరతహారం పేరుతో పచ్చదనం పర్యావరణం అంటూ ప్రభుత్వాలు చెట్లను పెంచుతూ గొప్పలుగా చెప్పుకుంటున్న ప్రభుత్వాలు గొడ్డలి వేటుకు చెట్లు నెలకొరుగుతున్నాయి. భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఏదో ఒక చోట చెట్లను నిత్యం నరికివేస్తున్నారు.  భువనగిరి మండలం హనుమపురం గ్రామంలో, తుక్కపురం రోడ్డు గ్లాస్ ఫ్యాక్టరీ ప్రాంతంలో, యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట గ్రామంలో పెద్ద ఎత్తున రోడ్లకు ఇరువైపుల హరితహారం చెట్లు నరికివేతకు గురవుతున్నా ఇటు పంచాయతీ అధికారులు అటు అటవీ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ప్రస్తుతం రోడ్ల వెంబడి నరికేస్తూనే ఉన్నారు. హరితహారం పేరుతో మొక్కలు నాటడం, విద్యుత్ లైన్లు, అడ్డుకు వస్తున్నాయని మళ్లీ విద్యుత్ శాఖ అధికారులు కొట్టివేయడం పరిపాటిగా మారింది. 

సొంత స్థలాల్లో పెరిగిన చెట్లను తొలగించడానికి అనుమతుల పేరుతో ఇబ్బందులు గురి చేసే అధికారులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వాలు ప్రజాధనం కోట్లాది రూపాయలు వెచ్చించి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.  ఇందులో బాగంగా ప్రతి ఏడాది వానకాలంలో ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి మొక్కలు నాటారు పెంచిన చెట్లను ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు నరికివేస్తున్నా కనీసం చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికారులు మొద్దు నిద్రలో పడిపోయారు నాటిన హరిత హారం లో నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోయింది మొక్కలను అధికారులు గాలికి వదిలేయడంతో మొక్కలను నరికివేస్తున్నారు ప్రభుత్వం చేపట్టిన హరిత హారం ద్వారా నాటిన మొక్కలకు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు అధికారులు నిద్ర మత్తులో వాటిని పట్టించుకోవడం లేదని స్థానికులు పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు.
వాల్టా చట్టానికి  తూట్లు పొడుస్తున్న అధికారాలు
వాల్ట చట్టాన్ని  అమలుపరచడంలో అధికారులు విఫలం చెందారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఎవరైనా తమ ఇంటి ఆవరణలోని చెట్లను తమంతట తాము నరికేయకూడదు ఆ చెట్టు వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురైతే విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అధికారులు పరిశీలించి నిజంగానే సమస్య ఉన్నట్లైతే చెట్లను కొట్టివేయడం లేదా అక్కడ నుండి తొలగించి మరోచోట ఏర్పాటు చేస్తారు ఒక చెట్టును తొలగించడానికి ప్రాసెసింగ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇలా కాదని నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ అవేవీ పట్టించుకోకుండా చెట్లు నరికేసిన వారిపై చర్యలు తీసుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ఉన్నతాధికారులు దృషి సారించి వృక్షాలు నరికేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు. పై విషయంపై జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా పై విషయం తమ దృష్టికి రాలేదని, చేట్లు నరికినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని తెలిపారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -