Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన

ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపకుండ కాంగ్రెస్ ప్రభుత్వం కాల యాపన చేస్తుందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జాటావత్రవినాయక్, ఎంపీపీ సలహా దారులు చెన్ను సుందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నాయనవానీకుంట గ్రామపంచాయతీ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి చౌకబార్ మాటలతో కాలం ఎల్ల బోస్తున్నారే తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శలు చేశారు.

ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా,కల్లబొల్లి మాటలు మాయమాటలతో కాలం గడుపుతున్నారని అన్నారు. కనీసం రైతులకు న్యాయమైన కరెంటు ఇవ్వడంలోవిఫలమయ్యారని,స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టకుండా కాలయాపన చేస్తూ,గ్రామీణ ప్రాంతంలో కనీస సౌకర్యాలు కూడా కరువైనాయని అన్నారు. ప్రజాపాలనలో కనీసం వీధిలైట్లు, మంచినీరు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అన్నారు. ఎన్నికలు పెడితే ఓడిపోతామని భయంతతో కుంటి సాకులు చూపుటున్నారని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కై భవిష్యత్ పోరాట కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్. సిద్ధంగా ఉందని అన్నారు.అధికార ప్రతినిధి. పొదిల శ్రీనివాస్. మండల యూత్ అధ్యక్షులు, మెండే సైదులు యాదవ్,ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి నాయక్,రామావత్ వినోద్ నాయక్,నడ్డినాగరాజు, హుస్సేన్ నాయక్,సీతారాం నాయక్, మంగ్య నాయక్,గోలియా నాయక్,శర్మ నాయక్,బాబు నాయక్,తరుణ్,రామారావు,నాగరాజు నాయక్, రామావత్ నాగరాజు నాయక్,శ్రీనివాస్ నాయక్,చందు. తదితరు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -