Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రభుత్వం 

పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రభుత్వం 

- Advertisement -

– బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల చిరకాల సొంత ఇంటి కోరిక నెరవేరుస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన రాజుకు చెందిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గృహప్రవేశం చేసిన రాజు కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి చిరకాల కోరికను నెరవేరుస్తుందన్నారు.

రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని, రానున్న రోజుల్లో మరిన్ని ఇండ్లు కేటాయిస్తామని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డిని నూతన గృహప్రవేశం చేసిన రాజు కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -