Saturday, November 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాలేజీలు మూసేసినా ప్రభుత్వానికి చలనంలేదు

కాలేజీలు మూసేసినా ప్రభుత్వానికి చలనంలేదు

- Advertisement -

విద్యార్థుల ఉద్యమంపై నిర్లక్ష్యం తగదు : రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య
ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-మెహిదీపట్నం

ఫీజు బకాయిల కోసం కాలేజీలు మూతపడినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని, విద్యార్థుల ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని రాజ్యసభ సభ్యులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు మూసేస్తే ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఫీజుబకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో ఎంతో ముఖ్యమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌ స్కీంలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఉచితాలకు వేల కోట్ల రూపా యలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించి డబ్బులు లేవనడం విచారకరమన్నారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఒక్కొక్క కాంట్రాక్టర్‌కు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం.. విద్యార్థుల ఫీజు బకాయిలకు మాత్రం రెండేండ్లుగా రూపాయి చెల్లించలేదని విమర్శిం చారు. ఫీజు బకాయిలకు రూ.6000 కోట్లు ఖర్చు చేయడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపో వడంతో కాలేజీ యాజమాన్యాలు, అందులో పని చేసే ఉపాధ్యాయులు మరోవైపు విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొం టున్నా రన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఫీజురీయిం బర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లిం చాలని, లేకపోతే విద్యార్థుల ఉద్యమం చిలికి చిలికి గాలి వానగా మారి ప్రభుత్వమే కూలిపో తుందని హెచ్చరి ంచారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నీలా వెంకటేష్‌, రాందేవ్‌, భరత్‌, అనంతయ్య, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -