Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే

ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే

- Advertisement -

– సచివాలయంలో హెల్త్‌ క్యాంప్‌ ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెనోవా ఆస్పత్రి సౌజన్యంతో ఏఐ బేస్డ్‌ మెగా కార్డియాక్‌ మెడికల్‌ క్యాంపును నిర్వహించారు. దాన్ని మంత్రి దామోదర ప్రారంభించారు. రెనోవా వైద్య సిబ్బంది అత్యాధునిక ఎక్విప్‌మెంట్‌ సాయంతో బీసీ, జీఆర్‌బీఎస్‌, ఈసీడీ, టూడీఈకో టెస్టులు చేశారు. కార్డియాలజీ, జనరల్‌ ఫిజిషన్‌ సేవలను అందించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ..మారుతున్న జీవన శైలిలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు హెల్త్‌ క్యాంపు పెట్టి వైద్య సేవలను, పరీక్షలను ఉచితంగా అందించిన రెనోవా వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -